హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more