ఐడిబిఐ బ్యాంకులో జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసి) ఆమోదం
ప్రభుత్వరంగంలోని ఐడిబిఐ బ్యాంకులో జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసి)వాటా కొనుగోలుకు బీమా నియంత్రణ క్రమబద్దీకరణసంస్థ(ఐఆర్‌డిఎఐ)ఆమోదించింది. ఐడిబిఐ బ్యాంకులో 51శాతం ప్రభుత్వ వాటాలను ఎల్‌ఐసి కొనుగోలుచేయాలనినిర్ణయించింది. ఈడీల్‌పై ముగ్గురు ఎల్‌ఐసి ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులో ఎల్‌ఐసికి ఎనిమిదిశాతం వాటాలున్నాయి. ప్రభుత్వం తన వాటాను తగ్గించుకునేందుకుగాను ఐడిబిఐ బ్యాంకు వాటాను ఎల్‌ఐసికి విక్రయిస్తుందని అంచనా. ఐఆర్‌డిఎఐ ఎల్‌ఐసి వాటా కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి బీమా నిబంధనలప్రకారం చూస్తేఎల్‌ఐసి ఏ ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల్లోనూ 15శాతం వాటాలకు మించి కొనుగోలుచేసేందుకు అనుమతించవు. అయితే ప్రత్యేకించి ఐడిబిఐ బ్యాంకు వాటా కొనుగోలులో మాత్రం బీమా నియంత్రణసంస్థ ఎల్‌ఐసికి మినహాయింపు ఇచ్చింది.