శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లోని గోకుల్ ఫ్లాట్స్, చందా నాయక్ తండ,అంబేద్కర్ నగర్,ల లొ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు, వసతుల గురించి ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను అడిగి తెలుసుకున్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నానాటికి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అద్వాన స్థితి బయటపడుతూనే ఉంది. విద్యార్థులు చదువుకోవడం తర్వాత సంగతి కనీస సౌకర్యలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీ టు పీజీ ఉచితంగా కార్పొరేట్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాల మారుస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదు. అని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మరి అద్వానంగా ఉన్నాయి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. తరగతి గదుల కొరత విద్యార్థులు తరగతి గదులు లేకపోవడం వల్ల అందరికీ ఒకే దగ్గర చేర్చి పాఠాలు చెప్పాల్సిన స్థితి ఉపాధ్యాయులకు కూడా ఇది తలకు మించిన భారం అవుతుంది. కమిషనర్ మరియు మండల విద్యాశాఖ అధికారి చొరవ తీసుకొని అదనపు తరగతి గదిలో నిర్మాణానికి వెంటనే అనుమతులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు కానీ పక్షంలో మరోసారి బిజెపి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రశాంతమైన వాతావరణంలో విద్య అభ్యసించే విధంగా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, రమేష్ సోమిశెట్టి , హరికృష్ణ, వినయ్ బాబు , కురుమ శ్రీశైలం , హరిప్రియ, కైతాపురం జితేందర్ , రమేష్ రెడ్డి ,చక్రాల గంగాధర్ , రోజా రమణి, స్వర్ణ శ్రీశైలం, శివ కుమార్ వర్మ, శోభా దుబే,వెంకటేశ్వరరావు, దేవేందర్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు..
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more