ఉప్పల్ : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై
భూ కబ్జా ఆరోపణలు తీవ్ర దుమారాన్నీ రేపుతున్నాయి. తన నియోజకవర్గంలో కాప్రా ప్రాంతంలో సర్వే నెం 152 లో 90 ఎకరాల భూ వివాదం కేసులో కోర్టు అదేశాలతో పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.. ప్రజల నుంచి ప్రతి పక్షాలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చేసిన
భూ కబ్జాలపై గత నాలుగు రోజులుగా బిజెపి పార్టీ ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
తాజాగా జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ లు ఇస్తున్నారు. ఈరోజు ఉప్పల్ పోలీసు స్టేషన్ లో బిజెపి నాయకులు డాక్టర్ శిల్పారెడ్డి, రేవల్లి రాజు, గోనె శ్రీకాంత్ ముదిరాజ్, రెడ్డిగారి దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వేంటనే అరెస్టు చేయాలని కంప్లైంట్ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భరత్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్, నరేష్ కుమార్, సమ్మయ్య పటేల్, డప్పు దత్తసాయి, తదితరులు పాల్గొన్నారు..