కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు, బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపుమేరకు ప్రతిరోజూ అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ మొదటి రోజు నుంచి
నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. కొండాపూర్, కుత్బుల్లాపూర్ ,సూరారం ,ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా లో నిత్యావసర వస్తువులు అందిస్తూ సేవాభావాన్ని చాటారు.

ఈరోజు బుధవారం బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను, బియ్యం ,కందిపప్పు, కూరగాయలు
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ, నిరుపేదలవద్దకు స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం.
ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసె వరకు ప్రజలందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని,
సామాజిక భాద్యతగా మనమందరం మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలని, లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించాల.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పద్ధతులను మనమంతా పాటిస్తేనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండగలమని, ప్రజలందరూ ఇంటికే పరిమితమై కరోనా వైరస్ నివారించడానికి భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు కొనుగోలు సమయంలో సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని.ప్రతి రోజు పరిశుభ్రంగా ఉండేటట్టు సహాయ సహకారాలు అందించాలని, వృద్ధులను బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.