బోడుప్పల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కురుమ సంఘం ఆధ్వర్యంలో 75 వ వర్ధంతి అంబేద్కర్ చౌరస్తా వద్దా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరుడు దొడ్డి కొమురయ్య 75 వ వర్ధంతి సందర్భంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా విముక్తి కోసం దోపిడి పాలన అంతం కోసం తొలి అమరుడు భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ పీడిత బడుగు బలహీన వర్గాల నిజాం ప్రభుత్వంపై పోరాట చేసినటువంటి యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాలని, నివాళులు అర్పించారు. ఆయన ఆశయం పై ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని, బడుగు బలహీన వర్గాలు అప్పుడే నిజమైన నివాళులర్పించిన వాళ్లమవుతామన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కులాల పెద్దమనుషులు పాల్గొన్నారు. కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగె నర్సింహ, మేడిపల్లి మండల్ కురుమ సంఘం అధ్యక్షుడు అసర్ల బీరప్ప, మాజీ వార్డు సభ్యులు కొత్త కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు నత్తి మైసయ్య, జై భారత్ బిసి పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దూస రామన్న, బహుజన్ సమాజ్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బండ నర్సింహ, మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.