
బిసి దళ్ జాతీయ అధ్యక్షులు దుంద్ర కుమార స్వామి, నూతన సంవత్సరం సంధర్భంగా బిసి మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు. మంగళవారం రోజు జరిగిన ప్రేత్యేక సమావేశం లో పలు బిసి సమస్యలపై మంత్రి దృష్టి కి కుమార స్వామి తీసుక వెళ్లారు. ముఖ్యంగా బిసిల కులాల వారీగా జనగణన, వర్గీకరణ మొదలగు అంశాలను మంత్రితో చర్చించడం జరిగింది.
అనంతరం బిసిల సమస్యలపై మంత్రికి మెమోరాండం బిసి దళ్ జాతీయ అధ్యక్షులు కుమార స్వామి ఇచ్చారు.
మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు అన్నీ విధాలుగా ఆదుకుంటుందని, బిసి ల అభివృద్ది కి ఎల్లప్పుడు పాటుపడుతుందని ఈ సంధర్భంగా తెలిపారు.