లక్ష్మీ గణపతి నవగ్రహ మహారుద్ర హోమం
గండిపేట మండలంలోని మణికొండ గ్రామంలో బీరప్ప మల్లన్న దేవాలయంలో జరిగిన లక్ష్మీ గణపతి నవగ్రహ మహారుద్ర హోమం శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి హాజరైన బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మరియు మండువ మధుసూదన శర్మ ,ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ బీరప్ప మల్లన్న ఆలయంలో ఈ కార్యక్రమాలు జరగడం సంతోషకరమని శివుడు యొక్క తొలి చెమట బీరప్ప అని మలి చెమట మల్లన్న ,గొల్ల కురుమల ఆరాధ్య దేవుళ్ళు అని,మణికొండ వాసులకి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో, సంతోషమైన జీవితాన్ని గడపాలని అలాంటి ఆలోచనతో భారతీయ బ్రాహ్మణ సేవా సమితి ద్వారా జరుగుతున్న లక్ష్మీగణపతి నవగ్రహ మహారుద్ర హోమం శివపార్వతుల కళ్యాణం మహోత్సవానికి చేస్తున్నారని , ఇది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద యోగ్యమని తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు …ఈ కార్యక్రమాన్ని, శ్రీ మండువ మధుసూధన శర్మ భారతీయ బ్రాహ్మణ సేవా ప్రధాన కార్యదర్శి గారు పర్యవేక్షణలో చేయడం జరిగింది