పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే వారి ఫ్యాన్స్ కి పండగే. ఇప్పుడు ఇందులో రాణా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ భీమ్లా నాయక్ మల్టీ స్టారర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సినిమా పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఒక ట్వీట్ కూడా చేశాడు.

నా సహోదరులు పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి, తమన్, సాగర్ కే చంద్ర లకు శుభాకాంక్షలు తెలిపేందుకు భీంలా నాయక్ మూవీ సందర్భంగా డైలీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాను అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

పద్మశ్రీ మొగిలయ్య గారు మరియు శివమణి వంటి అద్భుతమైన సంగీత కళాకారులను ఈ సందర్భంగా కలుసుకున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. అని కేటీఆర్ ట్విట్టర్లో తెలియజేశారు.
