హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలో 100 పడకల కొవిడ్ కేంద్రాన్ని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో కొవిడ్ రోగులకు ఉచితంగా ఐసీయూ సేవలను అందించనున్నారు. కొవిడ్ ఉచిత ఐసీయూ సేవలను ఆశ్రయ్ సంస్థ ఏర్పాటు చేసింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీ నవీన్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేశ్ రంజన్, సైబరాబాద్ సీపీ శ్రీ సజ్జనార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.