హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ నగరంలోని జలవిహార్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మతి సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ…
ఇవాళ కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారు. టీ – కాంగ్రెస్, టీ – బీజేపీ.. కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు పదవులు వచ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని పదవులు రాగానే.. గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు అని ఎద్దెవా చేశారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వయసులో మీ కంటే 20 ఏండ్ల పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.