హైదరాబాద్: సీఎం శ్రీ కేసీఆర్ గారికి ఇవాళ నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు శ్రీ ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం శ్రీ కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎం.వీ. రావు తెలిపారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more