కేసిఆర్ సెప్టెంబర్ 17 న గిరిజనులతో సమావేశమై, మాట్లడుతూ గిరిజనులకు ఉన్న 6 శాతం ఉన్న రిజర్వేషన్ల 10 శాతం వారం రోజులో పెంచుతా అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 10 రోజులు కావొస్తున్న ఇప్పటికి పెంచడం లేదని, ఎందుకు పెంచడం లేదో గిరిజనులు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రిజర్వేషన్లు పెంచడంలో ఆలస్యం చేస్తే గిరిజన సమాజం సీఎం కేసీఆర్ ను మాట తప్పిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకుంటుందన్నారు. తక్షణమే జీవో విడుదల చేసి 10% శాతం గిరిజన రిజర్వేషన్లని గ్రూప్-1 పోలీస్ రిక్రూట్మెంట్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ లలో తక్షణమే అమలు లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మూర్ఛ డిమాండ్ చేసిందన్నారు. గిరిజనులకు పోడు భూముల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. తాండలను గ్రామపంచాయతీలో గుర్తించిన దానిని రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఎందుకు గుర్తించలేదో తెలపాలని ప్రశ్నించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more