శేరిలింగంపల్లి : సహోదయా బెల్ క్లస్టర్ అండర్ 14 బాస్కెట్ బాల్ పోటీల్లో భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ బాస్కెట్ బాల్ క్రీడలో తమ సత్తా చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి తెలిపారు. బాచుపల్లిలోని కెనెడి ద గ్లోబల్ స్కూల్. లో. నిర్వహించిన. పోటీల్లో క్లస్టర్స్ పరిధిలోని సి.బి.ఎస్.ఈ స్కూల్స్ మొత్తం 14 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ముఖ్యంగా టీమ్ క్యాప్టన్ యుక్త, క్రీడకరిణిలు శ్రీలక్ష, శ్రేష్ఠ కాంత్ లు ప్రత్యర్ధి జట్లను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించడం లో కీలకపాత్ర పోషించి మూడో బాహుమతి సాధించారు. వీరిని జ్యోతి విద్యార్థులయ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్ లు అభినందించారు. వీరికి కఠోర శిక్షణ నిచ్చెన పి ఈ టి వేణుగోపాల్ ను అభినందించారు. మాట్లాడుతూ క్రీడల వల్ల చురుకుదనం పెరిగి, చదువుల్లో కూడా ఏకాగ్రత పెరుగుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు కూడా ప్రోత్సహించాలని కోరారు.చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.