ఆదిలాబాద్ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టును పొందిన తర్వాత స్వంత నియోజకవర్గానికి చేరుకున్న మంత్రి .తొలుత స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దంపతులు .అనంతరం శాంతినగర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దంపతులు ..వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేసిన అనంతరం పండితులు ఆశీర్వాదాన్ని పొందిన మంత్రి దంపతులు .మంత్రి జోగురామన్నకు డీఎస్పీ నర్సింహారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ శ్రేణులు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ముక్కోటి దేవతలతో పాటు ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం …తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం ….
మళ్లీ అందరి దీవెనలతో రెండవసారి అధికారంలోకి వస్తాం ..సిఎం కెసిఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది ..మరోమారు ఆయన నేతృత్వంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి చేస్తాం అని తెలియజేశాడు .