సి.ఎం. కె.సి.ఆర్. నిరుద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించారు. నిన్న వనపర్తి బహిరంగ సభలో ” నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి.” అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నట్లుగానే ఈరోజు అసెంబ్లీలో బద్జెట్ సమావేశాల ప్రసంగంలో ఆయన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈరోజే ఇస్తామని ప్రకటించారు.
తెలంగాణాలో 91,142 వేకెన్సీలు ఉన్నాయని, ఇందులో ఈరోజే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు చెప్పారు.
లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామనీ, ఇంకా లక్షా 56 వేల జాబ్లకు నోటిఫికేషన్ ప్రకటించామని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానులతో నేనే స్వయంగా చర్చించి, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది అని చెప్పారు.