ఇండియా : విశ్వక్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్తోంది. సమష్టి కృషితో పతకంపై ఆశలు రెకెత్తిస్తోంది. తాజాగా 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. కీలక క్వార్టర్ ఫైనల్లో 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరింది. కాగా, అసాధారణ రీతిలో ఒలింపిక్స్ హాకీలో 8 స్వర్ణాలు గెలిచిన భారత్.. చివరిసారి 1980లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో పతకం గెలవలేదు. అయితే గత అయిదేళ్లలో మెరుగుపడ్డ భారత్.. టోక్యోలో పతకంపై ఆశతో ఉంది. తాజాగా 41 ఏళ్ల తర్వాత భారత్ సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ మేరకు సెమీస్‌లో బెల్జియంతో తలపడనున్న భారత్ గెలువాలని కోరుకుందాం.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more