• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పబ్లిక్‌ హియరింగ్‌ లో స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్‌ను నియమించాలి -డిమాండ్

AdminbyAdmin
26/10/2024
inNews
0
పబ్లిక్‌ హియరింగ్‌ లో స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్‌ను నియమించాలి -డిమాండ్

పబ్లిక్‌ హియరింగ్‌లో
స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్‌ను నియమించాలి -డిమాండ్

కులగణన పై పబ్లిక్‌ హియరింగ్‌లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

సమగ్ర ఇంటింటి కులసర్వేలో ప్రామాణిక పద్ధతులు అనివార్యం

సర్వే ప్రశ్నావళిలో ఎలాంటి అంశాలు చేర్చారో వివరాలను అఖిలపక్షంతో చర్చించాలి

సమగ్ర కులసర్వేను స్వతంత్ర కులసర్వే కమిషన్‌ను నియమించి వివరాలను సేకరించాలి

సంచార, అర్థసంచార, విముక్తజాతుల వివరాలను ప్రత్యేకంగా వారు నివాసాలు ఉండే ప్రాంతాలను గుర్తించి వివరాలను సేకరించాలి

కులగణనపై పబ్లిక్‌ హియరింగ్‌లో అభిప్రాయాలు, సూచనలు వ్యక్తం చేసిన అఖిలపక్ష కుల సంఘాల ప్రతినిధులు

    రాష్ట్రప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఇంటింటి సమగ్ర కులసర్వేకు సంబంధించిన ప్రశ్నావళిలో ఉండే అంశాలను బహిర్గతం చేసి అఖిలపక్ష కులసంఘాలతో చర్చించి సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలని కులగణనపై జరిగిన పబ్లిక్‌ హియరింగ్‌లో కులసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీపుల్స్‌ కమిటీ ఆన్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌, తెలంగాణ బి.సి. ఉద్యోగుల ఫెడరేషన్‌లు సంయుక్తంగా కులగణనపై పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. పబ్లిక్‌ హియరింగ్‌ జ్యూరీ ప్యానెల్‌గా జస్టిస్‌ వి.చంద్రకుమార్‌, బి.సి. కమిషన్‌ పూర్వ ఛైర్మన్‌ డా|| వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రొఫెసర్‌ బి.ఎల్‌. విశ్వేశ్వరరావులు వ్యవహరించారు. కార్యక్రమానికి ప్రధాన సమన్వయ కర్తలుగా ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌, దేవుల సమ్మయ్యలు వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన పబ్లిక్‌ హియరింగ్‌లో పెద్దఎత్తున బి.సి., ఎస్‌.సి., ఎస్‌.టి. తదితర కుల సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. పలు నిర్మాణాత్మక సూచనలను చేశారు.
    రాష్ట్రంలో కులసర్వే నిర్వహించడానికన్నా ముందే సమగ్రంగా అన్ని పక్షాలతో రాష్ట్రప్రభుత్వం చర్చలు, సమావేశాలు నిర్వహించాలని సూచించడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలని కోరారు. బీహార్‌లో అక్కడి ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సమగ్ర కులసర్వే నిర్వహించడం జరిగిందని అయితే పలు నిర్దిష్ట విధానాలను అవలంబించక పోవడం వలన పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసిందని పలువురు పబ్లిక్‌ హియరింగ్‌లో సాధికారికంగా వివరించారు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా ముందస్తుగానే అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం అవసరమని పలువురు సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు సూచించారు. ఎన్యుమరేటర్స్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో ఎన్యుమరేటర్స్‌కు శిక్షణ, వారు పాటించాల్సిన గైడ్‌ రూపకల్పనలో అవలంబించాల్సిన పద్ధతుల మీద కూడా పబ్లిక్‌ హియరింగ్‌లో పలువురు సోదాహరణంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
    బీహార్‌లో అక్కడి రాష్ట్రప్రభుత్వ శాఖ అయిన జి.ఎ.డి. ద్వారా కులసర్వేను నిర్వహించడం వలన పలు విమర్శలు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆ రాష్ట్రప్రభుత్వం ఎదుర్కొందని నేటి పబ్లిక్‌ హియరింగ్‌లో పలువురు న్యాయవాదులు ఆ వివరాలను సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్‌ను నియమించాలని అందుకు అందుబాటులో ఉన్న కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చట్టం-1952 ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. సేకరించబడే వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించడము, తులనాత్మకంగా పరిశీలించడము మున్నగు అంశాలపై కృషిచేయడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని పబ్లిక్‌ హియరింగ్‌లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
    బి.సి. కమిషన్‌ చట్టంలో సర్వే చేయడానికి వీలుగా పలు సవరణలను తీసుకొచ్చి, బి.సి. కమిషన్‌ను కూడా ఇలాంటి కార్యక్రమాలలో పూర్తిగా ఉపయోగించుకోవచ్చునని పలువురు అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రభుత్వం కులసర్వే విషయంలో ఎలాంటి ప్రామాణిక పద్ధతులను అవలంబించ బోతున్నది, ఎలాంటి అంశాలను ప్రశ్నావళిలో చేర్చింది, ఎలాంటి విధాన నిర్ణయాలతో ముందుకు పోతున్నది అనే అంశాలపై అనేక సంశయాలు పబ్లిక్‌ హియరింగ్‌లో వ్యక్తమయ్యాయి. అన్ని సంశయాలకు, అనుమానాలకు నివృత్తిని కలిగించడానికి అఖిలపక్ష కులసంఘాల, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో, సామాజికవేత్తలు, విషయ నిపుణులు, నిపుణత గలిగిన వివిధ సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం అనివార్యమైందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పబ్లిక్‌ హియరింగ్‌లో వ్యక్తమైన అన్ని అభిప్రాయాలను పబ్లిక్‌ జ్యూరీప్యానెల్‌ వెంటనే ఒక నివేదిక రూపకల్పన చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సభకు అధ్యక్షత వహించిన దేవళ్ల సమ్మయ్య, సమన్వయకర్త కె.మురళీమనోహర్‌లు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ సుదర్శన్‌రావు, ప్రొఫెసర్‌ బాగయ్య, డాక్టర్‌ పృథ్వీరాజ్‌ యాదవ్‌, సతీష్‌ కొట్టె, వినోద్‌ కుర్వ, డా|| వేణుయాదవ్‌, డా|| తుల్జారాం సింగ్‌, డా|| విజయ్‌కుమార్‌, కె.పి. మురళీకృష్ణ, వితోబా, నరహరి, నిమ్మల వీరన్న, సి.హెచ్‌.ఉపేంద్ర, విజయేందర్‌సాగర్‌, పిల్లి రాజమౌళి, కొన్నె శంకర్‌గౌడ్‌, అనిల్‌కుమార్‌, తుమ్మనాపల్లి శ్రీనివాస్‌, చింతగింజ శ్రీహరిరావు, శివశంకర్‌ యాదవ్‌,  డా|| శోపరి శంకర్‌ ముదిరాజ్‌, పొన్నం దేవరాజ్‌గౌడ్‌, ఎం.సేనాపతి, తదితర సుమారు 150 కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, సామాజికవేత్తలు పెద్దఎత్తున పబ్లిక్‌ హియరింగ్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. 

An independent Caste survy Commission should be appointed in Telangana state . public hearing – demand
Tags: An independent Kulasurvey Commission should be appointed in the public hearing - demand
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News