సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర, సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాల కార్యకలాపాలు రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉన్నాయని, ఈ సంఘాలకు సకాలంలో రుణాలను అందించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలు అందించాలని ఉప సభాపతి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ జీ హెచ్ ఏం సి పరిధిలో యూ సి డీ కొత్త ప్రాజెక్ట్ అధికారులతో మంగళవారం సీతాఫలమండి క్యాంపు కార్యాలయంలో శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్ని మునిసిపల్ డివిజన్ల పరిధుల్లో మహిళా పొదుపు సంఘాలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, సర్కిల్ ప్రాజెక్ట్ అధికారి బలరాం తో పాటు సీతాఫలమండీ, బౌద్ధనగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక డివిజన్ల ఆర్గనైజర్లు, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు శ్రీ తీగుళ్ల కిషోర్ కుమార్, శ్రీ తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.