నాగ్లాండ్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వలే) రెండు స్థానాల్లో విజయం సాధించింది
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వలే) తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్
లింగాపూర్ కొమురంభీం (ఆసిఫాబాద్)
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్ మాట్లాడుతూ: వచ్చే2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన సోదరులారా! వచ్చే ఎన్నికల్లో మన ఓట్లు మన ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన సోదరులారా! అంబేద్కర్ సృష్టించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మాత్రమే వేద్దాం,మన బలగం ఎంతో తెలుసుకొందాం.కమ్మ పార్టీ కాక పోతే రెడ్డి పార్టీకి,అది కాక పోతే కాపు పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా మనము అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వలే) అభ్యర్థి నిలబెట్టి అతన్ని బలపరుచు కొందాం. కెసిఆర్ గెలుస్తాడా? లేక రేవంత్ రెడ్డి గెలుస్తాడా? అని చూడ వద్దు.మన గెలుపు ఓటములు గురించి ఆలోచనలు చేయండి.
సోదరులారా! స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఆధిపత్య కులాల వారికి ఊడిగం చేస్తూ,మన దన ,మనా ,ప్రాణాలు ను వారికి అర్పించి , మన భవిష్యత్తును ఓటు రూపంలో వారికి వేస్తే వారు మనకు చేసినది ఏంటి? ఒకసారి ఆలోచనలు చేయండి?ఒక్కరు (బి అర్ ఎస్) వాడిని,అని ఒకరు, (కాంగ్రెస్) వాడిని అని ఒకరు ఇలా మనలో మనమే పోటీ పడి మరీ ఓట్లు వేసి వారి కాళ్ళ దగ్గర కూర్చొని మాకు పదవులు ఇవ్యండి అని అడుకొంటున్నాము.ఇది కరెక్ట్ కాదు,ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి?భవిష్యత్తు రాజకీయం అంతా ఎస్సీ ఎస్టీ బీసీల బహుజనుల చుట్టే తిరుగుతుంది, మన హక్కుల కొరకు రాజీలేని పోరాటం చేద్దాం,పోరాటం చేయనిదే రాజ్యలక్ష్మి వరించదు.
ఎస్సీ ఎస్టీ బీసీల లో అత్యధిక జనాభా కలిగిన యాదవులు,శెట్టి బలిజ,గౌడ్ సామాజిక వర్గాలవారు, (బిసి),వర్గాల వారితో కలిసి పనిచేస్తే ,భవిష్యత్తు రాజకీయం అంతా మనదే.
జనరల్ ప్రతి నియోజక వర్గం లో బీసీ అభ్యర్దిని నిలబెట్టి మన ఓట్లు మనమే వేసుకోవాలి. అప్పుడు బీసీలకు సెపరేట్ ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది.తరువాత ఎలెక్షన్లో మనం బలమైన శక్తిగా ఎదుగుట కు అవకాశం ఉంది?
ఇప్పటికైనా బీసీలు అందరూ రెడ్డి,కమ్మ,కాపు, బ్రాహ్మణ, క్షత్రియ మొదలగు అగ్రవర్ణాలు వారి ఫోటోలతో ఫ్లెక్స్లు లు వేయకండి,మీ ఫోటోలతో ఫ్లెక్స్ లు వేసుకోండి,వారి ఫోటోలు పెద్దవి మీ ఫోటోలు,వారి కాళ్ళ క్రింద వేసుకొనుట మన బానిస లక్షణాలు ను తెలియ చేస్తుంది.బానిస లక్షణాలు ను విడనాడి స్వంతంగా ఎదుగుటకు ప్రయత్నం చేయాలి.
ఓట్లు మనవి,సీట్లు కూడా మనవే.
ఎస్సీ ఎస్టీ బీసీ (బహుజనుల) ఐక్యత వర్ధిల్లాలి. అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్ అన్నారు?