ఏపీలోని బీసీలను తాను ఏకం చేస్తానని, దానికి అవసరమైన ఆయుధాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పంపిణీ కోసం ఏపీ నుంచి గొర్రెలను కొనుగోలు చేయడం వల్ల అక్కడి యాదవులకు లాభం చేకూరిందని, చేపల పెంపకానికి అక్కడి నుంచే సీడ్‌ను దిగుమతి చేసుకున్నామని, ఇలాంటి విషయాలను బీసీల ఐక్యతకు ప్రయోగిస్తానని చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కేసీఆర్ కలవడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఏపీలో తన ప్రచారం రెండు, మూడు శాతమైనా ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more