తెలంగాణాలో దళితబంధు పథకం అమలు చేయడానికి సన్నద్ధం కావాలని సి.ఎం. కె.సి.ఆర్ కలక్తర్లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీష్ రావ్ స్పందించారు.
భారతీయ జనతా పార్టీ నేతలకు దళితులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
దళిత బంధు పథకం పై ఎమ్మెల్యేలు ఎంపీలతో మార్చి 31 లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు పారదర్శకంగా జరుగుతుందని ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం రెండు నెలల సమయమే ఉన్నందున ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు గ్రామాల్లో అమలు చేస్తామని వెల్లడించారు.