హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసింది సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈటల తల్లిలాంటి పార్టీని గుండెలమీద తన్నారు, గులాబీ జెండాను మోసం చేశారన్నారు. హుజూరాబాద్‌లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, దత్తత గ్రామం సిరిసేడులోనూ ఏ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రిగా పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు.