హఫీజ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు నూతన ఆహార భద్రత కార్డుల ( రేషన్ కార్డ్ లను) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన పేదలకు ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మంజూరైన సుమారు 600కార్డులను హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయం మరియు శాంతి నగర్ మహిళ భవన్ నందు హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు స్థానిక డివిజన్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బల్లింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వాల హరీష్ రావు, వార్డ్ సభ్యులు కనకమమిడి వెంకటేష్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సుదర్శన్, రవికుమార్, సయ్యాద్ సత్తార్ హుస్సేన్,సయ్యాద్ సాదిక్ హుస్సేన్,సుధాకర్ సయ్యాద్ సాబేర్ హుస్సేన్,శాంతయ్,ప్రవీణ్,గోపాల్,శ్రీనివాస్ నాయుడు, మల్లేష్, లక్షణ, రంజాన్, సుధాకర్, లాలూ పటేల్, సుదేశ్, పద్మ రావు, రవి, అధికారులు వి.అర్.ఓ గోపాల్,లక్ష్మి,రేషన్ డీలర్లు కిషోర్,అభిమన్యు,జైపాల్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు..