• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ప్రజా వ్యతిరేకత ఉన్నా గుజరాత్ బీజేపీదే: హిమాచల్‌కు కాంగ్రెస్ నీళ్

AdminbyAdmin
26/10/2017
inPolitics
0
gujarat elections
న్యూఢిల్లీ/సిమ్లా: ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా, జీఎస్టీ, నోట్ల రద్దును వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తున్నా గుజరాత్‌లో బీజేపీ గెలుపొందుతుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. తద్వారా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో క్లీన్ స్వీప్ సాధించే దిశగా అడుగులేస్తున్నదని నిర్ధారించింది. 182 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 115 – 125 స్థానాల్లో గెలుపొందుతుందని అననుకూల పరిస్థితుల్లోనూ బీజేపీ భారీ విజయాన్ని అందుకునే పరిస్థితి నెలకొన్నదని ఈ సర్వే వివరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ బీజేపీ సాధించగలుగుతుందని స్పష్టం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దఫా గట్టి పోటీ ఇచ్చినా కేవలం 57 – 65 స్థానాలతోనే సరిపెట్టుకుంటుదని విశ్లేషించిన ఇండియా టుడే సర్వే.. మరో మూడు స్థానాల వరకు ఇతరులు గెలుచుకుంటారని చెప్పింది. అధికార బీజేపీకి యధాతథంగా 48 శాతం, కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు లభిస్తాయని తేల్చేసింది. తర్వాతీ స్థానంలో కాంగ్రెస్ నేతలు శక్తిసిన్హ్, భరత్ సింగ్ సోలంకి తర్వాతీ స్థానంలో కాంగ్రెస్ నేతలు శక్తిసిన్హ్, భరత్ సింగ్ సోలంకి అత్యంత ఇష్టపడే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం విజయ్ రూపానీకి 34 శాతం మద్దతు లభించిందని, కాంగ్రెస్ నాయకులు శక్తిసిన్హ్ గోహిల్‌కి 19, భరత్ సింగ్ మాధవ్ సింగ్ సోలంకికి 11 శాతం మంది మద్దతునిస్తున్నారని పేర్కొంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంచి ముఖ్యమంత్రి అవుతాడని 10 శాతం మంది, పాటిదార్ల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్‌కు కేవలం ఆరు శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారని తెలుస్తున్నది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం 66 శాతం మంది ప్రధాని నరేంద్రమోదీ మంచి ప్రధాని అని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ వల్ల గుజరాత్ రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్నారు. 31 శాతం మంది మాత్రమే అందుకు భిన్నంగా ప్రతిస్పందించారని ఇండియా టుడే తెలిపింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో గుజరాత్ రాష్ట్రానికి నష్టమేమీ జరుగలేదని పేర్కొన్నది. వ్యాపారుల పలుకుబడి ఎక్కువగా ఉన్న గుజరాత్‌లో ఆర్థిక సంస్కరణలు గణనీయ మార్పు చూపనున్నాయి.

రాష్ట్ర ప్రగతి అశం 26 శాతం.. ఉద్యోగాల కల్పన 24%

సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం వల్ల 51 శాతం మంది అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల లాభం జరుగలేదని 53 శాతం మంది అంటున్నారు. సర్వేలో పాల్గొన్న 49 శాతం మంది పౌరులు నిరాశ చెందగా, ఏడు శాతం మంది ఆగ్రహిస్తున్నారు. 18 వేల మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేను గత నెల 25 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో అభివృద్ధి, ఉద్యోగాలు, పెరుగుతున్న ధరలు కీలకంగా మారాయన్నారు. ధరల పెరుగుదల అతిపెద్ద సమస్యగా మారుతుందని 31 శాతం, ఉద్యోగాల కల్పన 24 శాతం, అభివృద్ధి అంశం 16 శాతం, రోడ్ల నిర్మాణం తొమ్మిది శాతం మంది, ఆరు శాతం మంది నీటి సమస్య, నాలుగు శాతం వ్యవసాయ రంగ సమస్యలు కీలకంగా మారాయని సర్వే నిర్ధారించింది.

ప్రధాని మోదీతో సత్ఫలితాలు ఇలా Replay ప్రధాని మోదీతో సత్ఫలితాలు ఇలా ప్రధాని నరేంద్రమోదీ సగర్వంగా అమలు చేసినట్లు ప్రకటిస్తున్న జీఎస్టీ అమలులోకి రావడంతో 38 శాతం మంది సంతోషంగా ఉన్నారని, 51 శాతం మంది అసంతృప్తితో ఉన్నారని ఇండియా టుడే నిర్ధారించింది. నల్లధనం వెలికి తీసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని నరేంద్రమోదీ ప్రభుత్వం చెబుతోంది. కానీ 53 శాతం మంది గుజరాతీలు నోట్ల రద్దు వల్ల తమకు ఒరిగేదేమీ లేదని, 44 శాతం మంది మాత్రం సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం పనితీరుపై 38 శాతం మంది సంతృప్తితో ఉన్నారు. మరో 49 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఏడు శాతం మంది ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే సారాంశం.

రెండోస్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితం

వచ్చేనెల తొమ్మిదో తేదీన జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం వీరభద్రసింగ్ భారీగా నష్టపోతున్నారని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 68 స్థానాల హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 43 – 47 స్థానాలను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 21 – 25 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు రెండు సీట్లలో గెలుపొందుతారని పేర్కొన్నది. బీజేపీ 49 శాతం, కాంగ్రెస్ పార్టీ 38, ఇతరులు 13 శాతం ఓట్లు పొందుతారని ఈ సర్వే సారాంశం. బీజేపీ కంగ్రా ప్రాంతంలో 25 స్థానాలకు 18, మండీ రీజియన్‌లో 24 సీట్లకు 15, సిమ్లా ప్రాంతంలో 19 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లను గెలుచుకుంటుంది. కంగ్రాలో 52 శాతం, మండీలో 49, సిమ్లా 46 శాతం ఓట్లు కమలనాథులు పొందుతారని వివరించింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కంగ్రా, సిమ్లా రీజియన్లలో ఏడేసి సీట్లు, మండీ ప్రాంతంలో తొమ్మిది సీట్లు గెలుచుకుంటుందని నిర్దారించింది. కాంగ్రెస్ పార్టీకి కంగ్రాలో 35 శాతం, మండీలో 37, సిమ్లాలో 39 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాలకు 41 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. కాంగ్రెస్ పార్టీ 36, బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందాయి.

Sending
User Review
0(0 votes)
Tags: BJPElectionsfeaturedGujaratpolitics
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News