బంగారం ధరలు మంగళవారం నాడు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల రేటు రూ.200 పెరుగుదలతో రూ.38,770కి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ, దేశీయంగా ఆభరణ వర్తకుల కొనుగోళ్లు పెరగడంతో పసడి మరింత పుంజుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. రూపాయి బలహీనపడటం కూడా కొంతవరకు కారణమైంది. వెండి ధర మాత్రం దిగివచ్చింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో వెండి రూ.1,100 తగ్గి రూ.43,900కు జారుకుంది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.37,833గా, కిలో వెండి రూ.43,695గా నమోదైంది. అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్సు (31.5 గ్రాములు) బంగారం 1,496 డాలర్ల వద్ద ట్రేడవగా.. సిల్వర్ 16.93 డాలర్లు పలికింది. డాలర్ బలపడటంతోపాటు ట్రేడర్లు విలువైన లోహాల పెట్టుబడులపై లాభాల స్వీకరణకు పాల్పడటంతో ధరలు స్వల్పంగా తగ్గాయి.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more