కరీంనగర్ :తెలంగాణలో భారీగా వర్షాలు పడుతుండటంతో చెరువు మత్తళ్ళు దుంకుతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చెరువు మత్తడిలో పడి కొట్టుకుపోయిన ఒక వ్యక్తిని స్థానిక మత్స్యకారుల సహకారంతో గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి గారు కాపాడారు. ఇక వివరాల్లోకి వెలితే…
వ్యక్తి పడిపోయినవిషయం తెలుసుకున్నఎస్ఐ తిరుపతి గారు సంఘటన స్థలానికి వెంటనే వచ్చి మత్స్యకారుల సహకారంతో చర్యలు చేపట్టి బయటకు తీసుకొచ్చారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తి ని కాపాడేందుకు సహకరించిన మత్స్యకారులను అభినందించి వారికి పారితోషికం అందజేశారు. పోలీసు వాహనంలో అతనిని తీసుకెళ్లి వైద్యం చేయించి వారి నివాసానికి పంపించారు.