నిమ్స్ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన గంగాపురం పద్మ
పంజాగుట్ట లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ హాస్పిటల్ పరిధిలోగల పలు వినాయక స్వామి మండపాల్లో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శోభాయమానంగా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో శ్రీ మహిళా సంక్షేమ సంఘం గంగాపురం పద్మ అతిథులుగా పాల్గొని స్థానిక ఉద్యోగుల మరియు ఇతర లీడర్ల తో కలిసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిమ్స్ డిప్యూటీ రిజిస్టర్ రాజ్ కుమార్ ,శ్రీధర్, సుజాత, ఏం రాజ్ కుమార్, జలజ ,జ్యోతి, ప్రశాంత్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.