మైనింగ్ కింగ్ గా పేరుపొందిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి సినిమాల్లోకి పరిచయమవుతున్నాడు.
రాధాకృష్ణ దర్శకుడు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలియజేశారు. ఈ సినిమాకి వారాహి అనే పేరును ఖరారు చేశారు.
కిరీటి సినిమాలపై దృష్టి పెట్టి ఇండియాలోనే కాకుండా ఫారెన్ లో కూడా కోచింగ్ తీసుకున్నట్టు సమాచారం.కర్ణాటకలో ఎలాగో వీరికి మంచి పట్టు ఉండటం వల్ల తెలుగు కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తుండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు.