హబ్సిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, హబ్సిగూడ డివిజన్ లో ఈ రోజు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీ గారికి ధన్యవాదములు తెలిపే కార్యక్రమము వెంకట్ రెడ్డి నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్,
హబ్సిగూడ డివిజన్ కార్పోరేటర్ కక్కిరేణి చేతన హరిష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ప్రజలకు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంజయ్ పటేల్ వేములకొండ వెంకన్న గౌడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి చింతకింది ప్రవీణ్,, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి, ముశిగంపల శివగౌడ్ లు పాల్గొన్నారు