అసమానత్వం లేని సమాజం కోసం -మహిళా సాధికారత కు వినూత్న విధానాలలో కృషి చేయాలి- డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మహిళ జీవితాల్లో వెలుగులు నింపాలి -జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మహిళల హక్కులకు భంగం కలగకుండా.. మహిళ హక్కులను కోల్పోకుండా అన్ని అంశాలలోనూ పురోగతి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తెలిపారు. జాతీయ బీసీ దళ్ కాచిగూడ కార్యాలయంలో నిర్వహించిన “మహిళల సాధికారత *కు సంబంధించిన పోస్టర్ లాంఛ్ కార్యక్రమంలో
ముఖ్యఅతిథిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రత్యేక అతిధిగా పాల్గొని పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ మహిళలకు రాజకీయ స్వతంత్రత, ఆర్థిక సమానత సాధించడమే కాకుండా వారు కోరుకున్న దారిలో నడవగలగాలి. మహిళల పనికి సమాన వేతనం.. సరైన గౌరవం ఇచ్చిన నాడే దేశంలో మహిళా సాధికారత ఉన్నట్లు అర్థం. ఇంట్లోని ఆడవారిని గమనించి, గుర్తించి, ఆదరించి, గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు దుండ్ర కుమారస్వామి.
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ దేవతగా కొలవాల్సిన స్త్రీని పూజించడం పక్కన పెడితే వారిని అణచివేయడానికే ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలబడడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసిన రామపవిత్ర మరియు సింధూర ముందుకు వచ్చారు. రామ పవిత్ర చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో మంది మహిళల జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఉన్నానని అన్నారు. గ్రామస్థాయిలో వెనుకబడ్డ మహిళలకు డిజిటల్ రంగాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుంది. ఎంతో మంది మహిళలకు మంచి భవిష్యత్తును అందించడమే కాకుండా.. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా చేయడం నిజంగా అభినందనీయమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.