ఫ్లిప్‌కార్ట్నో కిడ్డింగ్ డేస్ సేల్‌ను ప్రారంభిం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్, యాప్‌లలో ఇవాళ నో కిడ్డింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. కేవలం రేపటి వరకు మాత్రమే ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా యాక్ససరీలు, వియరబుల్స్ తదితర అనేక రకాల ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ నో కిడ్డింగ్ డేస్ సేల్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్ రూ.3వేల తగ్గింపుతో రూ.28,900 ధరకు లభిస్తున్నది. యాపిల్ వాచ్ సిరీస్ 2 స్మార్ట్‌వాచ్‌పై కూడా రూ.3వేల తగ్గింపును అందిస్తున్నారు. దీంతో ఆ వాచ్‌ను రూ.24,900కు కొనుగోలు చేయవచ్చు. ఇక వాచ్ సిరీస్ 1 స్మార్ట్‌వాచ్ రూ.4వేల తగ్గింపుతో రూ.18,900కు, శాంసంగ్ గేర్ ఫిట్ 2 ప్రొ రూ.2400 తగ్గింపుతో రూ.11,590 ధరకు లభిస్తున్నాయి. అలాగే గూగుల్ క్రోమ్‌కాస్ట్ 2 రూ.2699కు, షియోమీ ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్ రూ.1199కు లభిస్తున్నాయి.
సేల్‌లో ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా రూ.8200 తగ్గింపుతో రూ.22,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. ఇవే కాకుండా పలు ప్రింటర్లు, కెమెరాలు, హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, రూటర్లు, పవర్ బ్యాంక్‌లు, మౌస్‌లు, ఇయర్‌ఫోన్స్‌పై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు యూజర్లకు లభిస్తున్నాయి. సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్ పే వాలెట్‌తో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.