• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Science BioScience

ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ ల్యాబొరేటరీస్ కు కేటీఆర్ భూమిపూజ

AdminbyAdmin
01/07/2018
inBioScience, Featured, Pharmaceuticals, S & T, Science
0
Ferring-pharmaceuticals

ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ ల్యాబొరేటరీస్ కు కేటీఆర్ భూమిపూజ

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీకి హైదరాబాద్ వేదికగా మారుతున్నదని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఔషధనగరాన్ని 19 వేల ఎకరాల పరిధిలో అత్యద్భుతంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. లైఫ్‌సైన్సెస్ ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా రెండు లక్షల మందికి, పరోక్షంగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. వచ్చే పదేండ్లలో ఈ సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఫార్మా, జీనోమ్‌వ్యాలీ, ఐటీ క్లస్టర్ల ఏర్పాటుతో ప్రపంచం హైదరాబాద్‌వైపు ఆసక్తిగా చూస్తున్నదని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట పరిధిలోని జీనోమ్‌వ్యాలీ (పారిశ్రామికవాడ)లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి మంత్రి కేటీఆర్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన ఆలోచనలతో, నిర్దిష్టమైన ప్రణాళికలతో అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేదిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. పారిశ్రామికరంగాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను కల్పిస్తున్నదని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా, ఐటీ, జీనోమ్‌వ్యాలీల ఏర్పాటుతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు, సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌ను రాబోయే పదేండ్లలో 100 బిలియన్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. జీనోమ్‌వ్యాలీ ఫేజ్-2 కోసం శామీర్‌పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కావాల్సినంత భూమి ఉన్నదని చెప్పారు. అక్కడ ఫార్మాక్లస్టర్‌కు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లస్టర్‌కోసం శిక్షణపొందిన ఉద్యోగుల లభ్యతకు ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన యురోపియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు జీఎస్కే, కీమో, డూపాంట్, బయోలాజికల్ ఇవాన్స్, నెక్టర్ వంటి కంపెనీల జాబితాలో ఫెర్రింగ్‌ఫార్మా చేరడం శుభసూచకమన్నారు. ఫెర్రింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేశ్ పట్టథిల్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల మంచి కంపెనీలు తమ పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. మొదటిసారిగా 1997లో మహారాష్ట్రలో ఒక రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) కేంద్రం, వాణిజ్య కార్యకలాపాల సంస్థను స్థాపించామన్నారు.

Tags: Pharma
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News