శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల సేకరణ కు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ నెలాకారులోపు ధర ఖాస్తుదారులు తమ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ తో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తో రావాలని సూచించారు. కొత్త దరఖాస్తులు తీసుకోబడవని, ఇతర సమాచారం కోసం ఏ. గోపాల కృష్ణ 9989930517 ను సంప్రదించాలని కోరారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more