చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి (Dr.Ranjith Reddy)సంపూర్ణ మద్దతు ఇస్తోంది జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు ఇతర అనుబంధ సంఘాలు. మనసున్న మనిషి, ప్రజలకు అండగా ఉండే మనిషి రంజిత్ రెడ్డి.. అలాంటి వ్యక్తిని మరోసారి పార్లమెంట్ కు పంపిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాం. అభివృద్ధి కోసమే ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. చేవెళ్ల ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడడానికి ఆయన సిద్ధం.
‘పోరాడితే పోయేదేం లేదు’.. అని నమ్మిన వ్యక్తి రంజిత్ రెడ్డి(Dr.Ranjith Reddy)
డాక్టర్ రంజిత్ రెడ్డి మొదటి నుండి పోరాటాన్ని నమ్ముకున్న మనిషి. పోరాడితే పోయేదేం లేదు.. అనే కార్ల్ మార్క్స్ వాదనను బాగా నమ్మిన వ్యక్తి. గత 5 సంవత్సరాలలో కూడా ఆయన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఎన్నో విషయాల్లో పోరాడారు. ఎలాగైనా తన ప్రజలకు మంచి చేయాలని అనుకున్నాడు.. కేంద్రంతో పోరాడి మరీ చేవెళ్ల అభివృద్ధికి కృషి చేశారు. సొంత ఖర్చుతో కూడా ఆయన ఎన్నో పనులను పూర్తీ చేశారు. సాయం అంటూ వచ్చిన వారికి తన స్థాయిని మించి సహాయం చేశారాయన. చేవెళ్లకు చాలా వరకూ జాతీయ రహదారి పనులు వచ్చాయి. ఒకప్పుడు రోడ్లు బాగో లేక ఎంతో మంది ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన చేవెళ్లలో రోడ్లకు సంబంధించి ఊహించని మార్పును తీసుకుని వచ్చారు.
అధికారం ఉంటేనే అభివృద్ధి:
కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక అవకాశవాదం కూడా లేదని రంజిత్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. అధికారం ఉంటేనే అభివృద్ధి చేయగలం.. కేవలం చేవెళ్ల అభివృద్ధి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా రంజిత్ రెడ్డికి ఎంపీ సీటును ఇచ్చే వారు. అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి కారణం ప్రజలకు చేయాలనుకుంటున్న సేవనే. 1970 తర్వాత మొదటి సారిగా చేవెళ్ల బస్టాండ్‌ను పునరుద్ధరించడానికి కారణం రంజిత్ రెడ్డి. స్టేడియం నిర్మించింది ఆయన ఇచ్చిన రూ. 50 లక్షలు రూపాయలతోనే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం ఉచిత డయాగ్నస్టిక్ అంబులెన్స్ ను కూడా తీసుకుని వచ్చిందీ ఆయనే. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అది ఆగకూడదని నమ్మిన వ్యక్తి రంజిత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పని చేస్తోంది:
కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు అద్భుతంగా పని చేస్తున్నాయి.. వాగ్దానాన్ని నెరవేర్చగలరో లేదోనని మొదట్లో అనుమానాలు పెంచుకున్నారు రంజిత్ రెడ్డి. ఆరు హామీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం తీసుకొని కుల గణన జీవో :26 ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రక నిర్ణయం. ఇలా ఎన్నో సాహసోపేతమైన, చారిత్రాత్మకమైన నిర్ణయాలు 100 రోజులలో తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రంజిత్ రెడ్డి చర్చలు కూడా సఫలం అయ్యాయి.. రాబోయే రోజుల్లో కూడా ఆరు హామీలను పూర్తీ చేయడంపై దృష్టి పెట్టినట్లు కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీ వైపు రంజిత్ రెడ్డి ఆకర్షితులు అయ్యారు. నాలుగు నెలల్లో అధికారుల నియామకం, ఉద్యోగాల భర్తీ, పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేసిందని రంజిత్ రెడ్డి నమ్మారు. అందుకే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
ఇన్నాళ్లూ ప్రజలకు అండగా.. ఇప్పుడేమో ప్రజలే ఆయనకు మద్దతుగా
ఎంపీగా ఉన్న సమయంలో రంజిత్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనను గెలిపించుకోడానికి ప్రజలు ముందుకు వచ్చారు. ఎన్నో కుల సంఘాలు ఇప్పటికే ఆయనకు మద్దతును తెలిపాయి. చేవెళ్లలో 15 శాతం ముస్లింలు, 15 శాతం మాదిగలు, 13 నుంచి 14 శాతం ముదిరాజ్‌లు ఉన్నారు. అత్యధిక భాగం బీసీలు ఉన్నారు. సింహభాగం ఉన్న బీసీలు రంజిత్ రెడ్డికి మద్దతును ఇస్తూ ఉండడంతో ఆయన గెలుపు గ్యారెంటీనే. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కూడా రంజిత్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. రాబోయే రోజుల్లో రంజిత్ రెడ్డి మరిన్ని పదవులను పొందాలని.. ప్రజలకు మరింత మంచి చేయాలని ఆకాంక్షిస్తూ ఉంది జాతీయ బీసీ దళ్.