తెలంగాణ: తెలంగాణలో కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి మూలానా ఎంతో మంది పసిబిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే, కరోనాని కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రోజువారిగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తంగా చూస్తే 94,189 నమూనాలను పరీక్షించగా 2493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. మరో 15 మంది కరోనా కాటుకు బలైపోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3308కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 318, నల్గొండ 165, రంగారెడ్డి 152, మేడ్చల్ మల్కాజ్ గిరి 137, కరీంనగర్ 129, ఖమ్మం 121, కొత్తగూడెం జిల్లాల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..