మల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మల్లాపూర్ డివిజన్ లో ఈరోజు వార్డ్ ఆఫీస్ లో GHMC కార్మికులకు దుప్పట్లు , LED బల్బులు పంపిణి చేసిన స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లాపూర్ డివిజన్ ని స్వచ్ఛ డివిజన్ గా తీర్చిదిద్దే పనిలో అలుపెరుగని సైనికుల్లా పని చేస్తున్న సఫాయి కార్మికులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పాలిటదేవుడని, అడగకుండానే బాగోగులన్నీ చూసుకుంటున్నారని అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా మరింత నిబద్ధదతో పని చేయాలని సిబ్బందితో అన్నారు.
ఈ పంపిణి కార్యక్రమంలో మల్లాపూర్ జవాన్ యాదగిరి , ఇంచార్జ్ SFA బీ.గోవర్ధన్ రెడ్డి , G కుర్మన్న , శ్రీను , నరేష్ , రాములు , పాండు , వజ్రమ్మ , B లక్ష్మి , సిద్ధమ్మ , రాములమ్మ , సునీత , K లక్ష్మి , పుష్ప , చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.