కరోనావైరస్( కోవిడ్ 19) కట్టడికి ప్రభుత్వంతో ప్రజల సమిష్ఠి కృషి అవసరమని తొలి పలుకు పత్రిక ఎక్జిక్యూటీవ్ ఎడిటర్ డా. కేశవ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్టం లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళణ చెందకుండా ప్రభుత్వ అదేశాలను పాటిస్తూ మన ఆరోగ్యాలతో పాటు తోటి వారి ఆరోగ్యాలన కాపాడాల్సిన భాద్యత మన పై ఉన్నదని, మనమందరం ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిషలు కష్టపడుతున్నాయి. కావున అందరూ అర్థం చేసుకుని ఎవరికి వారు చాలా కఠినంగా, క్రమశిక్షణగా స్వీయ నిర్భంధం విధించుకోవాలని. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితి అదుపు తప్పితే చాలా ప్రమాదమకరమని సామాజిక కార్యకర్త / తొలి పలుకు పత్రిక ఎక్జిక్యూటీవ్ ఎడిటర్ డా. కేశవ రెడ్డి తెలియజేశారు. బయట తిరగకుండా ఇంటిలోనే వుండాలని, అత్యవసరమై బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని, మనమందరం మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలని. లాక్ డౌన్, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని కోరారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more