బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి పిలుపుమేరకు , బీసీ దళ్ ఆధ్వర్యంలో జగదీర్ గుట్ట కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లాలో నిరుపేదలకు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగినది. లాక్ డౌన్ వలన అనేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షులు జి ఐలయ్య గౌడ్ బియ్యము కూరగాయలు నిత్యావసర సరుకులను 50 మందికి అందజేశారు ఈ సందర్భంగా ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ ఇంట్లోనే ఉండి సమిష్టిగా కరోణను తరిమేద్దాం అని
, కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని అవగాహన కల్పించారు.అనవసరంగా బయటతిరగకుండ మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాలను కాపాడాలని వివరించి కోవిడ్ 19పై తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలియజేశాడు.ప్రజలను కాపాడడానికి అహర్నిశలు పనిచేస్తున్న అధికారుల కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకొని పూర్తిస్థాయిలో సహకరించినప్పుడే కరోనా వైరస్ నియంత్రించగలమని, లాక్ డోన్ ఆంక్షలు ప్రజల ప్రాణరక్షణకే అని మనం అర్థం చేసుకుని పూర్తిస్థాయిలో సహకరించాలని వారికి నమస్కరించి వేడుకుంటున్నారు. సామాజిక భాద్యతగా మనమందరం మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలి. లాక్ డౌన్, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని తెలియజేశాడు.