అడ్డ గూడూరు: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లా, అడ్డ గూడూరు మండలంలో ఈరోజు జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో ఇటికాల చిరంజీవినీ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఎస్సీ విభాగం నుండి తొలగించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్దే లక్ష్యంగా అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఇటికాల చిరంజీవిని ఆ పదవి నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరిగారి ప్రీతమ్, ఇటికాల చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని, ఇటికాల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని, ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసే అధికారం మీకు లేదు అని మండిపడ్డారు.
తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూరారం నవీన్ కుమార్ మాట్లాడుతూ..
ఇటికాల చిరంజీవి పై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపణ చేయాలి, గతంలోనే ఎన్నోసార్లు తనని పార్టీ పదవి నుండి తొలగించాలని ప్రయత్నం చేశారు,
చివరికి ఒక దళిత మహిళ కేసును అడ్డుపెట్టుకొని తొలగించారు, చిరంజీవి ఎల్లప్పుడూ దళితుల ఆత్మగౌరవం కోసం పని చేస్తాడు. నగరిగారి ప్రీతమ్ లాంటి నీతి మాలిన పనులు చేయడనీ హెచ్చరిస్తూ, చిరంజీవిని రాజకీయంగా దెబ్బ తీయ్యాలని చూస్తుంటే సహించేది లేదని సురారం నవీన్ కుమార్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మండల నాయకులు వెంకట్ రెడ్డి. ముక్కామల నరసయ్య, చిప్పలపల్లి పరశురాములు, చీపురుపల్లి మహేష్, కడారి నవీన్, చిప్పలపల్లి నవీన్, తరుణ్, దేశ బోయిన తరుణ్, సూరారం సతీష్, చిప్పలపల్లి కళ్యాణ్, చిప్పలపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు