వరంగల్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మాటిచ్చి నెరవేర్చకపోయినా, తెలంగాణ రాష్ట్రం మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.1000కోట్ల పెట్టుబడితో ప్రైవేటు రంగంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నది. కొద్ది నెలల్లోనే ఇది ప్రారంభమవుతుంది’ అని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్వీట్‌చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ ఫ్యాక్టరీ కొద్ది నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించనుంది. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ వ్యవహారం దాదాపు 40 ఏండ్లుగా కొనసాగుతున్నది. 1970 ప్రాంతంలోనే అప్పటి కేంద్రప్రభుత్వం కాజీపేట్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1980 ప్రాంతంలో మరోసారి ఆమోదం తెలపగా, రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పరిసర ప్రాంతాల్లో 1,500 ఎకరాల స్థలాన్ని సేకరించింది. అయినా కేంద్రం మరోసారి మాట తప్పింది. చివరికి రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కాజీపేట్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీఇచ్చింది. కానీ మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరుచేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు పలుమార్లు కోచ్ ఫ్యాక్టరీ విషయమై, ప్రధానికి, కేంద్ర మంత్రులకు నివేదించారు. కానీ విభజనహామీలను మరచిన కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం ఇటీవల తెలంగాణకు కోచ్ ఫ్యాక్ట రీ మంజూరు చేసేప్రసక్తే లేదని స్పష్టంచేసింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా మేధా సర్వోసంస్థ రూ.1,000కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కొండకల్‌లో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసింది. ఇది అత్యాధునిక రైల్‌కోచ్‌లు తయారుచేసే ఫ్యాక్టరీ. భారతదేశంలోనే ప్రైవేటు రంగంలో రైలు బోగీలు తయారుచేసే అతిపెద్ద ఫ్యాక్టరీ కావడం విశేషం. దీని ద్వారా సుమారు 2,200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్‌కు అత్యాధునిక రైల్‌కోచ్‌లతోపాటు ఇతర పరికరాలను సరఫరా చేస్తున్న సంస్థల్లో మేధా సర్వో అతి ముఖ్యమైనది. ఆగస్టు 2020లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంతి కేటీఆర్ ఈ ఫ్యాక్టరీకి పునాదిరాయి వేయగా, కోచ్‌లు, లోకోమోటివ్‌లు, ఇంటర్‌సిటీ ట్రైన్‌సెట్‌లు, మెట్రోరైళ్లు, మోనోరైళ్లు ఇక్కడ తయారుకానున్నాయి. సంవత్సరానికి 500 బోగీలు తయారుచేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more