సి.ఎం. కె.సి.ఆర్. రాకేశ్ టికాయత్ మరియూ ముఖ్య రైతు సంఘాల నాయకులతో ఢిల్లీలో కలుస్తారని సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి తెలంగాణా రాష్ట్ర ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే పార్లమెంట్‌లో ఈమేరకు నిరసనలు చేయాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు. తెలంగాణాలో సోమవారం నుంచి తెరాస ఆందోళనలు చేపడుతుందని ఇప్పటికే కేటీఆర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా భార్య శోభ, కుమార్తెలతో నిన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడ కె.సి.ఆర్, మరియూ ఆయన భార్య వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని 11వ తారీఖున ఢిల్లీలో టీఆర్‌ఎస్ ధర్నా చేయనుంది. ఇంతకుముందు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతు సంఘాల ముఖ్య నాయకులను సి.ఎం. ధర్నాలో పాల్గొనాలని సూచించనున్నారు.