హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన ఒకటన్నారు. వారం రోజుల పాటు తనను, తన సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న ప్రభుత్వ అధికారులు, హైకోర్టు సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులకు కృతజ్ఞతలు చెప్పారు. దయచేసి కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని సూచించారు. తెలుగు ప్రజల దీవెనల బలంతో తన రాజ్యాంగ బద్ధ విధులను సమర్ధవంతంగా నిర్వహించగలనన్న నమ్మకంతో పయనమవుతున్నానని సీజేఐ ఎన్.వి. రమణ తెలిపారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more