కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ నేథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రం లో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల ఒకలాగ పంజాబ్ రాష్ట్రం పట్ల ఒక లాగా ప్రవర్తిస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు అని అన్నారు… ముఖ్య మంత్రి కెసిఆర్ రైతులు పట్ల వారి క్షేమం గురించి ఎపుడూ ఆలోచిస్తూ రైతు బంధు…అందించి దేశానికి ఆదర్శం అయ్యారని అన్నారు..ఎన్నో ప్రాజెక్ట్ లు తీసుకు వచ్చి బీడు భూములు ను పచ్చని పంట పొలాలు గా తీర్చి దిద్దారు చెప్పారు…ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రైతులూ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్ పాల్గొన్నారు…
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more