జన్మదిన వేడుకల్లో పాల్గోన్న ప్రముఖులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ పాత్రికేయుడు, బీసీ దుదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు ,ఆంధ్రజ్యోతి షేక్ మహమ్మద్ రఫీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా brs జిల్ల నాయకుడు శ్రీపాద శ్రీను,స్మైల్ వెల్ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కిమా శ్రీకాంత్ ల ఆధ్వర్యం లో సోమవారం స్మైల్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ కోసం పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్మైల్ వెల్ఫేయిర్ సొసైటీ ఉపాధ్యక్షులు సాయి గౌడ్ , కుంటాల అశోక్ తో పాటు మీడియా మిత్రులు , అభిమానులు పాల్గొన్నారు.