• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

‘కులగణన’ కేంద్రమే చేయాలి – సిఫారసు చేయండి-డాక్టర్ వకుళాభరణం

AdminbyAdmin
08/06/2023
inNews
0
‘కులగణన’ కేంద్రమే చేయాలి – సిఫారసు చేయండి-డాక్టర్ వకుళాభరణం

‘కులగణన’ కేంద్రమే చేయాలి – సిఫారసు చేయండి

  • జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసి కోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం

• తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం – దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి.
• బీహార్ – ‘పాట్నా హైకోర్టు’ కులసర్వేను కూడా నిలుపుదల చేసింది – సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన” చేపట్టాలి – సిఫారసు చేయండి.
• OBC జాబితా వర్గీకరణలో జాప్యం నివారించి, జస్టిస్ రోహిణి కమిషన్ నుండి త్వరితగతిన నివేదిక తెప్పిoచి – వర్గీకరణను అమల్లోకి తీసుకురండి.

విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్ల శాతం, జాబితాల పునర్విభజన, మార్పులు, చేర్పులను శాస్త్రీయంగా నిర్ణయించడానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘ కులగణన’ చేపట్టాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ సిఫారసు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు కోరారు.
గురువారంనాడు న్యూఢిల్లీలో బికాజీ కామ ప్లేస్, త్రికూట్-1 లో గల జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ తో డా|| వకుళాభరణం ప్రత్యేకంగా భేటి అయ్యారు. పలు అంశాల వారిగా కూలంకశంగా చర్చించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందచేశారు. తొలిసారిగా కలిసిన ఈ నేపథ్యంలో ఇరువురు ఛైర్మన్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందచేసుకున్నారు. శాలువాలతో సత్కరించుకున్నారు.

ఈ ప్రత్యేక భేటి సందర్భంగా… జాతీయ ఛైర్మన్ తో చర్చించిన అంశాలు…

(1) కేంద్రం ప్రత్యేకంగా ‘కులగణన’ చేపట్టాలి. ‘కులగణన’ చేపట్టడం వలన ప్రధానంగా ‘బీసీ’ ల అభ్యున్నతికి పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి వీలుకల్గుతుంది. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ల అమలులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు, రిజర్వేషన్ల శాతo స్థిరీకరణకు ఉన్న అవరోధాలకు, అడ్డంకులకు నివారణ లభిస్తుంది. ‘కులగణన’ కై కేంద్రానికి సిఫారసు చేయండి.

(2) దేశవ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలలో లేవు. దేశానికి సంక్షేమ పథకాల అమలులో ‘రోల్ మోడల్’ తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ మహాత్మా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు, విదేశి విద్యా నిధి (Overseas Scholarship), రియంబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ (RTF) బోధనా రుసుం పథకం, EMI లతో నిమిత్తం లేని ఆర్థిక చేయూత, కళ్యాణ లక్ష్మి మున్నగునవి. ఇలాంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కు సిఫారసు చేయండి.

(3) 2023-24 కేంద్ర వార్షిక బడ్జెట్ లో 56 % శాతం జనాభా కలిగిన OBC లకు కేంద్రం కేవలం ₹ 2 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏ మేరకు సరిపోవు. 2 లక్షల కోట్ల నిధులు కేటాయించేలా సిఫారసు చేయండి.

(4) కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు అనివార్యమైనది. ఈ దిశగా చర్యలకు కేంద్రంకు నివేదించండి.

(5) కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలుకు ‘బ్యాక్ లాగ్’ విధానాన్ని OBC లకు కూడా వర్తించేలా సిఫారసు చేయండి.

(6) రాష్ట్ర బీసీ జాబితాలో నమోదై విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్న బీసీ కులాలను, కేంద్రం OBC జాబితాలో చేర్చడానికి సిఫారసు చేయండి. ఇప్పటికే ఈ సామాజిక వర్గాల ప్రజలు ఉన్నతమైన అవకాశాలు కోల్పోతున్నారు.

(7) నాన్ క్రీమీ లేయర్ పరిధిని 8 లక్షలుగా నిర్ణయించి 6 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ సమీక్షించలేదు. ఈ నేపధ్యంలో వెంటనే సమీక్షించి ఆదాయ పరిమితి విధింపును రూ. 15 లక్షలకు పెంపుదల చేసేలా కేంద్రానికి సిఫారసు చేయండి.

  
                                                                
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News