వేదిక పై భగ్గుమన్న రగడ?
నిధుల కేటాయింపులు ఏవి? బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్
బీసీల సమున్నతికి కృషి చేస్తున్నది మోడీ ప్రభుత్వమే డాక్టర్ కే లక్ష్మణ్ .అయితే నిధుల కేటాయింపులు ఏవి? ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఎక్కడ ?రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్.
అఖిల భారత శిష్టకరణం ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ వకుళాభరణంల వాదోపవాదాలు.
ఆదివారం నాడు అఖిలభారత శిష్టకరణం కులస్తుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక రెహమత్ నగర్, యూసఫ్ గూడా ఆడిటోరియం లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బిజెపి జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ ,రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఇరువురు ప్రసంగాలలో, బీసీలకు ఎవరి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పుకునే ప్రయత్నం చేశారు. డాక్టర్ K. లక్ష్మణ్ ప్రసంగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ శాతం తగ్గటానికి గల కారణం పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ మే అని అన్నారు. తాము జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించాలని విశ్వకర్మలను కేంద్రం ప్రత్యేక పథకం ద్వారా ఆదుకుంటుందని వివరించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సుప్రీం నిబంధనల కొరకు విజయవంతంగా స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ను అమలు జరిపిన ఘనత తమదే అని చెప్పుకున్నారు. అలాగే శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు నాడు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న లోపాలను సరిదిద్దే లా చేయగలిగానని చెప్పారు. దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండటం వల్ల ,ఈ వర్గాలకు సమున్నతంగా అవకాశాలు పెరిగాయని తెలియజేశారు .సభలో మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ …డాక్టర్ K. లక్ష్మణ్ కు అంకితభావం ఉందని అయితే మోడీ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని స్పష్టం చేశారు.
*45 లక్షల వేల కోట్ల ఆర్థిక బడ్జెట్లో 2 వేల కోట్లు మాత్రమే కేటాయించి, బీసీల ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకోవడం సబబు కాదని అన్నారు.
*జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బధ్ధత కల్పిస్తే సరిపోదని ,9 నెలల విరామం అనంతరం
చైర్మన్ వేసారని ,గత మూడు నెలలుగా వైస్ చైర్మన్ ,సభ్యులను నియమించలేదని, దీనితో కేవలం చైర్మన్ ఒక్కడే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని కృష్ణమోహన్ అన్నారు .ఈ రాజ్యాంగ బధ్ధ బీసీ కమిషన్ ,బీసీలకు ఏమాత్రం ఉపయోగపడని సంస్థగా మారిందని ఆయన తెలిపారు. మరి ఈ ఘనత కూడా మోడీ ప్రభుత్వం కే వర్తిస్తుందన్నారు .
- జనాభా గణనలో కులగణన చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడేమో కులగణన చేయబోమని ప్రకటించింది. ఈ కారణంగానే దేశంలో, స్థానిక సంస్థల ఎన్నికలలో, బీసీ రిజర్వేషన్లు గల్లంతు అయ్యే ప్రమాదం ఏర్పడిందని వకుళాభరణం సమాచారయుక్తం గా, సభలో, తన ప్రసంగంలో సోదాహరణంగా చెప్పారు.
- కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు బీసీల చిరకాల డిమాండ్. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోవడానికి కారణాలు ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా డాక్టర్ K. లక్ష్మణ్ స్పందిస్తూ, పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు .డాక్టర్ వకుళాభరణం ప్రతిస్పందిస్తూ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే బీసీలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి