బి.సి. కులాల సంక్షేమమే ధ్యేయంగా దూసుకెళ్తున్న బి.సి.దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సరికొత్త ఫంథాలో రూపొందించిన పాట ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. బడ్జెట్ లో కేటాయింపుల దగ్గర నుండి పార్లమెంటు వరకూ బి.సి.లకు జరుగుతున్న అన్యాలను ఎండగట్టడం లో ఎప్పుడూ ముందుండే కుమారస్వామి గారు ఇప్పుడు బి.సి. ల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు, ప్రభుత్వం వరకు తన వాణిని వినిపించేందుకు ఈ పాటని రూపొందించారు.
బి.సి. లలో అన్ని సామాజిక వర్గాలను స్ప్రుశిస్తూ వారి జీవన శైలిని అద్దం పట్టేట్లు, దుండ్ర కుమారస్వామి గారు వారితో మమేకమవుతూ బి.సి. ల అన్ని వర్గాల గళాలను ఇందులో వినిపించారు. ఈ పాటకు ధర్మవరపు పవన్ సంగీత సాహిత్యాలు సమకూర్చగా, బి. రాజ్ కుమార్, ఎం. నాగ భాస్కర్, దుండ్ర కుమారస్వామి లు గాత్రాన్ని అందించారు.