బీసీ ఆమరణ నిరాహార దీక్ష – ముగింపు .
42 శాతం బీసీ రిజర్వేషన్ల పై 9వ రోజుకు చేరిన బీసీ నాయకులు అమర నిరాహార దీక్ష
సందర్శించి మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు, వి కృష్ణమోహన్ రావు మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం కు పెంచాలని గత తొమ్మిది రోజులుగా హైదరాబాద్ హాస్పటల్లో అమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న బీసీ యూత్ అధ్యక్షుడు సంజయ్ అమరణ నిరాహాదీక్ష తొమ్మిదవ చేరుకుంది.
సోమవారం నాడు, హాస్పటల్లో దీక్ష చేస్తున్న సంజయ్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు, వి కృష్ణమోహన్రావు ,మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి విరమింప చేశారు.
ఈ సందర్భంగా వీరికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు , బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి కృష్ణమోహన్రావు మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ గురికే మల్లేష్ యాదవ్ ,బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ,రామకృష్ణ, నీలం వెంకటేష్ జయంతి ,ఎస్ రవి యాదవ్ సిపిఎం, బిజెపి, కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ నాయకులు సందర్శించి పరామర్శించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంపు విషయంలో స్పష్టమైన విధానం అమలవడం లేదన్నారు. కులగణన చేసి రిజర్వేషన్ పెంచడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుకళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ కుల గణన ఉద్యమకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ముందుకెళుతున్నారని ఆయన రాహుల్ ని అభినందించారు. కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం జరిపి తొందరగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ప్రకటించాలని కోరారు .కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం రాహుల్ గాంధీ ప్రకటించారు దీనిపై జాప్యం ఎందుకు అన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం కోట ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ లో న్యాయం ఉందని తప్పకుండా ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.