బిసి దల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్ దాస్ ఆధ్వర్యంలో కొల్లూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .
ఈ సందర్భంగా బీసీదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
స్వాతంత్య్రం సాధించడం కోసం బీసీలు కీలకపాత్ర పోషించారు,తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కీలకపాత్ర పోషించారు అలాగే మరొక బీసీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని తెలియజేశారు.
ఏ జాతి పేరు చెబితే పోరాటాలకు ప్రతిరూపాలు,త్యాగాలకు ప్రతిరూపాలు ఉద్యమాలకు పెట్టిన పేరు అయినా బీసీలు వెనుకకు నెట్టబడుతున్నారని రాజకీయంగా కనుమరుగై పొతున్నామని బాధాకరం వ్యక్తంచేశారు.
బీసీలందరు కలిసికట్టుగా పోరాడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్ దాస్,
వి వెంకటరమణ,కనకయ్య, రాజేష్, శివ, నరేష్ మరియు ఇతరులు.